Tikamaka Thanda: ఊరందరికీ మతిమరుపు ఉంటే..? | 'Tikamaka Thanda' Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Tikamaka Thanda: ఊరందరికీ మతిమరుపు ఉంటే..?

Dec 14 2023 2:52 PM | Updated on Dec 14 2023 3:03 PM

Tikamaka Thanda Movie Release Date Out - Sakshi

ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్న సినిమా తికమకతాండ. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనే కథాంశం.ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత  తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ : ట్విన్స్ రామ్ హరి హీరోలుగా ఒక కొత్త ప్రయోగంతో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. 

వేరే బిజినెస్ లు చేస్తున్న మా పిల్లలకి సినిమా పైన ఉన్న మక్కువతో వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని నిర్మించాం. ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చాడు. మనందరికీ తెలుసు ఊరంతా మతిమరుపు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళు పడే ఇబ్బందులు బాధలు ఎలా ఉంటాయి. కామెడీగా ఉంటూనే మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది’అన్నారు.  

దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ : తెలంగాణలోని ఒక మంచి విలేజ్ నెట్వర్క్ లేని చోట అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమాని చిత్రీకరించాం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన వస్తుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ నెల 15న థియేటర్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మా సినిమాని ప్రేక్షకులు అందరూ చూసే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement