థగ్‌లైఫ్‌ షూటింగ్‌ పూర్తి.. భారీ ధరకు డిజిటల్‌ రైట్స్‌ | Thug Life Movie Shooting Complete | Sakshi
Sakshi News home page

థగ్‌లైఫ్‌ షూటింగ్‌ పూర్తి.. భారీ ధరకు డిజిటల్‌ రైట్స్‌

Sep 22 2024 12:49 PM | Updated on Sep 22 2024 1:05 PM

Thug Life Movie Shooting Complete

కోలీవుడ్‌ స్టార్‌ హీరో  కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్‌లైఫ్‌. మణిరత్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు శింబు, నటి త్రిష, జోజూ జార్జ్‌, ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్‌ కార్తీక్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కమలహాసన్‌కు చెందిన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌, మణిరత్నంకు చెందిన మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌జెయింట్‌ మూవీస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. 

36 ఏళ్ల క్రితం మణిరత్నం, కమలహాసన్‌ కాంబోలో రూపొందిన చిత్రం నాయకన్‌ (నాయకుడు). ఆ తరువాత ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం థగ్‌ లైఫ్‌. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇది నటుడు కమలహాసన్‌ నటిస్తున్న 233వ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా ఆయన ఇందులో 3 పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్లు యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దానికి సంబందించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

థగ్‌లైఫ్‌ చిత్రం వ్యాపారం మొదలైందని సమాచారం. ఈ చిత్ర డిజిటల్‌ హాక్కులను రూ.150 కోట్లకు విక్రయించినట్లు తాజాగా సమాచారం. ఇంత పెద్దమొత్తంలో డిజిటల్‌ వ్యాపారం ఇంతకు ముందు ఏ చిత్రానికి జరగలేదనే ప్రచారం సాగుతోంది. కాగా థగ్‌లైఫ్‌ చిత్రాన్ని వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement