'తంగలాన్‌' అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన విక్రమ్‌ | Thangalaan Movie Sequel Announced By Vikram | Sakshi
Sakshi News home page

'తంగలాన్‌' అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన విక్రమ్‌

Aug 17 2024 2:52 PM | Updated on Aug 17 2024 3:09 PM

Thangalaan Movie Sequel Announced By Vikram

విక్రమ్‌- పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా తంగలాన్‌. ఆగష్టు 15న విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రాణిస్తుంది. ప్రస్తుతం థియేటర్స్‌లలో రన్‌ అవుతున్న సినిమాల్లో తంగలాన్‌ కాస్త బెటర్‌ అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఎప్పుడూ కూడా ఆలోచనాత్మకత సినిమాలను డైరెక్ట్‌ చేసే పా. రంజిత్‌.. ఇప్పుడు కూడా విక్రమ్‌తో పెద్ద ప్రయోగమే చేశాడు. ప్రేక్షకులను మెప్పించిన తంగలాన్‌ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని తాజాగా విక్రమ్‌ ప్రకటించారు.

పాన్‌ ఇండియా రేంజ్‌లో కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, జ్యోతి దేశ్‌ పాండే నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ ఇందులో కీలకమైన పాత్రలు పోషించారు. రెండురోజుల్లో బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 30 కోట్లకు వరకు కలెక్షన్స్‌ రాబట్టిన తంగలాన్‌ తాజాగా హైదరబాద్‌లో సక్సెస్‌మీట్‌ ఏర్సాటు చేశారు. అక్కడ విక్రమ్‌ ఇలా చెప్పుకొచ్చాడు. తంగలాన్‌ అనేది ఒక మట్టి సినిమా అని ఆయన పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని బలంగా నమ్మానని ఆయన అన్నాడు. ఈ  క్రమంలోనే 'తంగలాన్‌ 2' కూడా  తీసుకొస్తామని విక్రమ్‌ ప్రకటించాడు. ఇదే విషయం గురించి దర్శకుడు పా. రంజిత్, నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో ఈ విషయంపై మాట్లాడుకున్నామని ఆయన అన్నాడు. పా రంజిత్ కాస్త రిలాక్స్‌ అయ్యాక అయ్యాక పార్-ట్ 2 ప్రారంభిస్తామని తెలిపాడు.

1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్‌ సినిమా మాస్టర్‌పీస్‍లా చరిత్రలో నిలిచిపోతుందని స్టూడియోగ్రీన్ ప్రొడక్షన్ హౌస్ సీఈవో ధనుంజేయన్ చెప్పారు. ఆస్కార్ అవార్డు రేంజ్‌ వరకు ఈ సినిమాను తీసుకెళ్లాలని ఇప్పటికే అభిమానుల నుంచి విన్నపం అందుతుందని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement