C Kalyan : 'దిల్‌రాజును తప్పుదారి పట్టించారు, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు'

Telugu Film Producers Council President C Kalyan Press Meet - Sakshi

సినిమా షూటింగ్స్‌ నిలిపివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగలేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ అన్నారు. దిల్‌రాజు, సి. కల్యాణ్‌ ప్యానెల్‌ వేరు వేరే కాదని, నిర్మాతలు  కొంతమంది దిల్ రాజును తప్పుదారి పట్టించారని ఆరోపించారు.  దిల్ రాజుతో తనను పోలుస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఇప్పటివరకు సుమారు 80 చిన్న సినిమాలు తీశానని,  ఎవరిని మోసం చేయలేదని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. ప్రొడ్యూసర్‌ గిల్ట్‌ మాఫియా వల్ల మొత్తం నాశనం అవుతుంది. గిల్డ్‌లో 27 మంది సభ్యులున్నారు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల సమస్యలనే నిర్మాతల మండలి పరిష్కరించింది. 

2019లో మేం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎవరు సంస్థకు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోండి. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చా. ప్రొడ్యూసర్ గిల్డ్ , నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నం చేశా. అధ్యక్ష పదవి మోజులో నా ప్రయత్నాన్ని నీరుగార్చారు అంటూ చెప్పుకొచ్చారు. కాగా రేపు(ఫిబ్రవరి 19)న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరగనున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సి. కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top