టాలీవుడ్‌ నిర్మాతల మండలి భేటీ.. కీలకాంశాలపై చర్చ! | Sakshi
Sakshi News home page

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి భేటీ.. కీలకాంశాలపై చర్చ!

Published Wed, Jul 20 2022 9:56 AM

Telugu Film Producers Council Meeting On 21St July 2022 - Sakshi

Telugu Film Producers Council Meeting: రేపు (గురువారం) తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం కానుంది. హైదరాబాద్‌ ఫిలీం ఛాంబర్‌లో నిర్వహించే ప్రత్యేక జనరల్‌ బాడీ మీటింగ్‌లో కౌన్సిల్ సభ్యులందరు హాజరు కావాలని నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్‌ ఛార్జీలు, టికెట్ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్‌ సమస్యలు, మేనేజర్‌ల పాత్ర, నటులు, టెక్నీషియన్స్‌ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. 

కాగా ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లు బంద్‌ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాలపై నిర్వహించే చర్చలు ప్రారంభదశలోనే ఉన్నట్లు ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం (జులై 21) తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 

చదవండి:👇 
షూటింగ్స్‌ బంద్‌పై దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..

నా మైండ్‌ సెట్‌ చాలా మారింది: నాగ చైతన్య
కరీనా కపూర్‌ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్‌
డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్‌.. గర్భవతిగా నమ్మిస్తూ..
చిక్కుల్లో సింగర్‌ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక

Advertisement
 
Advertisement
 
Advertisement