Sravana Bhargavi Annamayya Controversy: వివాదంలో శ్రావణ భార్గవి.. అన్నమయ్య సంకీర్తనపై ఆగ్రహం

Annamayya Family Fires On Sravana Bhargavi: అనేక గీతాలను ఆలపించి టాలీవుడ్ ప్రముఖ సింగర్‌గా గుర్తింపు పొందింది శ్రావణ భార్గవి. అయితే గత కొద్ది కాలంగా ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె తాజాగా వివాదంలో చిక్కుకుంది. అందుకు కారణం ఆమె పాడిన పాటే. విషయంలోకి వెళితే..తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది.
శృంగార సంకీర్తన పట్ల గాయని శ్రవణా భార్గవి చేసిన వీడియోపై అన్నమయ్య వంశస్తుడు హరినారాయణ చార్యులు మండిపడుతున్నారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడం పట్ల తప్పుబట్టారు. అలాగే ఆమె అందాన్ని వర్ణించడానికి ఆ కీర్తనను ఉపయోగించటం తప్పు అని ఆగ్రహిస్తున్నారు. ఈ విషయంపై శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె బాధ్యతరాహిత్యంగా సమాధానిచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని ఆయన అన్నారు.
చదవండి: డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ..
అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి..
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..