Telugu Film Chamber Of Commerce Key Decision On Shooting Band - Sakshi
Sakshi News home page

Telugu Film Chamber: సోమవారం నుంచి షూటింగ్స్‌ బంద్‌.. ఫిలిం చాంబర్‌ కీలక నిర్ణయం

Jul 31 2022 2:43 PM | Updated on Jul 31 2022 3:37 PM

Telugu Film Chamber Of Commerce Key Decision On Shooting Band - Sakshi

తెలుగు ఫిలిం చాంబర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఆగస్ట్‌ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌ నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్‌ 1న షూటింగ్స్‌ బంద్‌ చేయాలని టాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై చర్చించేందుకే ఆదివారం ఫిలిం చాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశమైంది. ఈ సమావేశంలో  గిల్డ్‌ తీసుకున్న నిర్ణయానికి  ఫిలిం చాంబర్‌ మద్దతు ఇచ్చింది.  24 క్రాఫ్ట్స్ లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేవరకు షూటింగ్స్‌ నిలివేస్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్  బసిరెడ్డి  వెల్లడించారు. రన్నింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్స్‌ కూడా నిలివివేస్తున్నామని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు  అన్నారు. సమస్యల పరిష్కారం దొరికేంత వరకు ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement