
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు అనూహ్య స్పందన లబిస్తోంది. సంతోష్ కుమార్ చాలెంజ్‌ను అన్ని రంగాల ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్వీకరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. దానిలో భాగంగా తన ఇంట్లోనే పుట్టిన రోజున మొక్కలు నాటారు మహేష్ బాబు. ఆ తర్వాత మొక్కలు పెంచడం వల్ల ఎంత ఉపయోగమో తెలిపారు. ఇది చాలెంజ్ కాదు.. భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అని తెలిపిన మహేష్.. ఈ చాలెంజ్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, తమిళ హీరో ఇలయదళపతి విజయ్, హీరోయిన్ శ్రుతీహాసన్‌లను నామినేట్ చేశారు. అయితే మహేష్ విసిరిన చాలెంజ్‌ను తమిళ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ స్వీకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటుతున్న ఫొటోలను తన ట్వీట్‌లో పోస్ట్ చేశారు. (ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి)
This is for you @urstrulyMahesh garu. Here’s to a Greener India and Good health. Thank you #StaySafe pic.twitter.com/1mRYknFDwA
— Vijay (@actorvijay) August 11, 2020
‘మహేష్‌గారు నేను మొక్కలు నాటేది మీకోసం.. ఇక ఈ మొక్కలు ఆకుపచ్చని భారతావనితో పాటు మంచి ఆరోగ్యం కోసం. ధన్యవాదాలు.. క్షేమంగా ఉండండి’ అని విజయ్ తన ట్వీట్‌లో పేర్కొంటూ.. మొక్కలు నాటుతున్న ఫొటోలను షేర్ చేశారు. ఇక మహేష్ బాబు విసిరిన చాలెంజ్‌ని త్వరలోనే తీసుకుంటానని శృతిహాసన్ ఇప్పటికే తెలిపారు. తారక్ కూడా మహేష్ చాలెంజ్‌ను స్వీకరిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే మహేష్ చెప్పగానే చాలెంజ్ స్వీకరించిన విజయ్‌కు ఆయన అభిమానులు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.