నవంబర్‌ కథేంటి?

Tamannaah wraps up Disney+ Hotstar November Story - Sakshi

‘నవంబర్‌ స్టోరీ’ సిరీస్‌తో వెబ్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ఈ సిరీస్‌ చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. తండ్రీ–కూతురు చుట్టూ తిరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. చేయని తప్పుకు శిక్ష అనుభవించే తండ్రి, అతన్ని కాపాడుకునే కూతురిగా తమన్నా కనిపించనున్నారు. నూతన దర్శకుడు రామ్‌ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ‘‘నేను చేసిన ఎగ్జయిటింగ్‌ ప్రాజెక్ట్స్‌లో ‘నవంబర్‌ స్టోరీ’ ఒకటి. మీ అందరికీ ఈ సిరీస్‌ను త్వరగా చూపించాలని ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని ఈ సిరీస్‌ చిత్రీకరణ పూర్తి చేసిన సందర్భంగా తమన్నా అన్నారు.  తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్‌ రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top