ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా

Tamannaah Bhatia Shares Weird Beauty Tips - Sakshi

చాలామందికి అనేక కారణాలతో ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మారుస్తూ ఉంటారు.  ఇక సినిమా హీరోయిన్స్‌ అయితే ఫారిన్‌ బ్రాండ్‌ కాస్టోటిక్స్‌ లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వాడతారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం మొటిమలు రాకుండా నివారించేందుకు ఉమ్మి వాడుతుందట. వినడానికి కాస్త షాకింగ్‌గానే ఉంది. కానీ ఈ మాట స్వయంగా తమన్నానే చెప్పింది.

ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను కూడా వాడుతానని చెప్పింది. ఉదయాన్నే లేచిన తర్వాత తన లాలాజాలం(సలైవా)ను అప్లై చేస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు సలైవా స్కిన్ ప్రాబ్లెమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని తెలిపింది.ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా చేస్తున్న మ్యాస్ట్రో అనే సినిమాలోను నటిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top