ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

ఓటీటీకి వచ్చేస్తోన్న హిట్ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Thu, May 23 2024 7:10 PM

Tabu, Kareena Kapoor, Kriti Sanon starrer Crew OTT Release On This Date

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ నటించిన చిత్రం 'క్రూ'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. రాజేశ్‌ ఏ కృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.  ఈ చిత్రంలో ముగ్గురు స్టార్‌ హీరోయిన్స్‌ ఎయిర్‌ హోస్టెస్‌ పాత్రల్లో కనిపించారు.

అసలు కథేంటంటే?
పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్‌లో ఓరోజు సడన్‌గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్‌ అయింది.

 

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement