13 ఏళ్ల ప్రేమ.. మూడుముళ్ల బంధంగా మారిన వేళ.. | Sakshi
Sakshi News home page

Surbhi Chandna: 13 ఏళ్లుగా ప్రియుడితో నటి డేటింగ్‌.. పెళ్లితో ఒక్కటైన జంట

Published Mon, Mar 4 2024 8:30 AM

Surbhi Chandna Ties Knot With Karan Sharma In Jaipur - Sakshi

బుల్లితెర నటి సురభి చందన పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కరణ్‌ శర్మతో ఏడడుగులు వేసింది. 13 ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకుంది. జైపూర్‌లో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు కొత్త జంట సిల్వర్‌ కలర్‌ డ్రెస్సులను ఎంచుకున్నారు.

డ్యాన్స్‌ చేస్తూ స్టేజీపైకి..
పెళ్లిలో ఓ రొమాంటిక్‌ పాట ప్లే అవుతుండగా తను కూడా ఆ పాట పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ వరుడివైపు తన్మయత్వంతో అడుగులు వేసింది సురభి. పెళ్లికి ముందు తన స్నేహితులకు బ్యాచిలరేట్‌ పార్టీ కూడా ఇచ్చిందీ బ్యూటీ. కాగా సుర‌భి 'తార‌క్ మెహ‌తా కా ఉల్టా చ‌ష్మా'లో అతిథి పాత్ర‌లో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియ‌ల్‌లో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది.

సీరియల్స్‌ ద్వారా గుర్తింపు
'ఇష్క్‌బాజ్‌', 'సంజీవ‌ని', 'నాగిన్ 5', 'హున‌ర్బాజ్‌:  దేశ్ కీ షాన్‌' ఇలా పలు ధారావాహికల్లో నటించింది. బాబీ జాసూస్‌ చిత్రంతో వెండితెరపై తళుక్కుమని మెరిసింది. కరణ్‌ శర్మ విషయానికి వస్తే 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'ప‌విత్ర రిష్తా' వంటి సీరియ‌ల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం 'ఉదారియ‌న్' అనే సీరియ‌ల్ చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement