జస్ట్‌ సూపర్‌ మేన్‌.. అంతే!  | Sakshi
Sakshi News home page

జస్ట్‌ సూపర్‌ మేన్‌.. అంతే! 

Published Sat, Mar 2 2024 5:42 AM

Superman: Legacy Gets Title Change From James Gunn - Sakshi

‘‘కథ రాయడం మొదలుపెట్టి, తొలి డ్రాఫ్ట్‌ పూర్తి చేసేవరకూ నా సినిమాకు ‘సూపర్‌మేన్‌: లెగసీ’ అనే టైటిల్‌నే అనుకున్నాను. కానీ ఫైనల్‌ డ్రాఫ్ట్‌ పూర్తి చేశాక ‘లెగసీ’ని వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా సినిమా టైటిల్‌ జస్ట్‌ ‘సూపర్‌మేన్‌’... అంతే. మా ఈ సూపర్‌మేన్‌ వచ్చే ఏడాది జూలై 11న మీ ముందుకు వస్తాడు’’ అని సామాజిక మాధ్యమాల ద్వారా దర్శకుడు  జేమ్స్‌ గన్‌ పేర్కొన్నారు. సూపర్‌మేన్‌ క్యారెక్టర్‌తో ఇప్పటివరకూ ‘సూపర్‌మేన్‌’ ఫ్రాంచైజీలను నిర్మించిన డీసీ స్టూడియోస్‌ తాజా సూపర్‌మేన్‌ చిత్రాన్ని నిర్మించనుంది.

అయితే సూపర్‌మేన్‌ని కొత్త రకంగా చూపించనున్నారు జేమ్స్‌ గన్‌. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో సూపర్‌మేన్‌ ధరించిన సూట్‌కి భిన్నంగా తాజా చిత్రంలోని సూపర్‌మేన్‌ సూట్‌ ఉంటుందట. కాగా ఈ మధ్యకాలంలో సూపర్‌మేన్‌ అంటే నటుడు హెన్రీ కవిల్‌ గుర్తొస్తారు. 2013 నుంచి 2021 వరకూ డీసీ స్టూడియోస్‌ నిర్మించిన సూపర్‌మేన్‌ చిత్రాల్లో టైటిల్‌ రోల్‌లో అద్భుతంగా ఒదిగిపోయారు హెన్రీ. కానీ, తాజా చిత్రంలో ఈ  పాత్రను డేవిడ్‌ కోరెన్స్‌వెట్‌ చేయనున్నారు. ‘‘సూపర్‌మేన్‌ జీవితంలోని  పూర్వ భాగంపై ఈ చిత్రం ఉంటుంది. ఈ పాత్రను హెన్రీ కవిల్‌ చేయలేడు. అందుకే డేవిడ్‌ కోరెన్స్‌వెట్‌ని తీసుకున్నాం’’ అని జేమ్స్‌ గన్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటివరకూ మూడు నాలుగు చిత్రాల్లో మాత్రమే నటించిన 30 ఏళ్ల డేవిడ్‌ కోరెన్స్‌వెట్‌కి ‘సూపర్‌మేన్‌’ చాన్స్‌ రావడం అనేది గొప్ప విషయం అని హాలీవుడ్‌ అంటోంది. 
 

 
Advertisement
 
Advertisement