Superstar Krishna Records: తెలుగు సినీ పరిశ్రమలో అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ

Super Star Krishna Rare Records And Plays Different Roles In Movies - Sakshi

సూపర్‌స్టార్ కృష్ణ అంటే తెలుగు సినీ ప్రపంచంలో తెలియని వారుండరు. అంతలా ఆ పేరు ప్రేక్షకుల గుండెల్లో అంతలా పాతుకుపోయింది. ఆయన నటనకు ప్రతిరూపం. అలనాటి తెలుగు సినిమాల్లో ఆయన ముద్ర చెరిగిపోని స్వప్నం. ఎన్నో అరుదైన రికార్డులు ఆయన సొంతం. టాలీవుడ్ నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఏ హీరో సాధించని అరుదైన రికార్డును సాధించిన ఏకైక స్టార్ కృష్ణ మాత్రమే. అందుకే ఆయన పేరు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. 

(చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే.. వైద్యులు)

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘట్టమనేని కృష్ణ.. నటనతోనే ఆగిపోకుండా దర్శకుడు, నిర్మాతగా, ఎడిటర్‌గానూ పని చేశారు. సినీ పరిశ్రమలో కృష్ణ కెరీర్ దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగిందంటే ఆయన నటనకు ఎంత ప్రాముఖ్యత ఇ‍చ్చేవారో తెలుస్తోంది. దాదాపు 350 సినిమాల దాకా నటించారాయన.

హ్యాట్రిక్‌ రోల్స్‌తో అబ్బురపరిచిన స్టార్‌
సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం పోషించే నటులను చూస్తాం. కానీ ఒకే సినిమాలో ఒకే నటుడు బహుళ పాత్రల్లో నటించడం అనేది చాలా అరుదుగా కనిపించే దృశ్యం. అలాంటి పాత్రల్లో అవలీలగా నటించడం ఒక్క సూపర్ స్టార్‌కే సాధ్యమైంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ త్రిపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించడం ఆయనకే సాధ్యమైంది. ఇలా మూడు పాత్రల్లో కనిపించడం ఒక్క సినిమాతోనే ఆగిపోలేదు. కుమారరాజా, డాక్టర్‌-సినీ యాక్టర్‌, రక్త సంబంధం, పగపట్టిన సింహం.. ఇలా మూడు కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన త్రిపాత్రాభియనంతో అలరించారు.

ఆ చిత్రాలు ఇవే..
ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా టాలీవుడ్‌లో అరుదైన రికార్డు సృష్టించారు. ఆపై త్రిపాత్రాభినయ చిత్రాల్లో..  మొదటి సినిమా కుమారరాజాలో తొలిసారిగా మూడు పాత్రల్లో నటించారాయన. ఇది కన్నడ చిత్రం శంకర్ గురుకి రీమేక్. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వర్షన్‌లో కృష్ణ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు ఆయనే పోషించారు. ఈ చిత్రం సినిమా సూపర్ హిట్ అయింది.

ఈ సినిమా తర్వాత కృష్ణ తన ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన రెండో చిత్రం విజయనిర్మల దర్శకత్వం వహించిన డాక్టర్ సినీ యాక్టర్‌. సినిమాలో తండ్రి పాత్రతో పాటు కొడుకుగా, మేనల్లుడి పాత్రల్లో ఆయనే నటించారు. ఆ తర్వాత 'పగపట్టిన సింహం' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చేశాడు. ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్‌గా, పోలీసాఫీసర్‌గా, లాయర్‌గా మూడు పాత్రల్లో మెప్పించారు.

సిరిపురం మొనగాడు, బంగారు కాపురం, బొబ్బిలి దొర వంటి ఇతర చిత్రాలలో కూడా బహుళ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు సూపర్ స్టార్. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top