Sunny Leone Express Audition Experience With Anurag Kashyap - Sakshi
Sakshi News home page

Sunny Leone: రూమ్‌ నిండా మనుషులు.. అప్పుడే అనిపించింది: సన్నీ లియోన్

Apr 16 2023 3:01 PM | Updated on Apr 16 2023 4:04 PM

Sunny Leone Express Audition Experience With Anurag Kashyap - Sakshi

బాలీవుడ్‌ భామ సన్నీ లియోన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కెన్నెడీ'. ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే  ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ పోస్టర్‌ నెటిజన్స్‌ దృష్టిని ఆకర్షించింది. సన్నీ లియోన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ  సినిమా ఆడిషన్‌పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెన్నెడీ సినిమాకు ఆడిషన్స్‌ కోసం చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. రూమ్‌ మొత్తం మనుషులు ఉండటం చూసి చాలా కంగారు పడ్డానన్నారు.

సన్నీ లియోన్ మాట్లాడుతూ..' కెన్నెడీలో ఆఫర్‌ కోసం అనురాగ్‌ నాకు ఫోన్‌ చేసి రమ్మన్నారు. దర్శక, నిర్మాతలు మాత్రమే ఆడిషన్‌ చేస్తారని తెలుసు. అందుకే ఎలాంటి భయం లేకుండా వెళ్లాను. తీరా చూస్తే అక్కడ సినిమా యూనిట్ అంతా ఉంది. సినిమా కోసం పని చేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌, ఇతర టీమ్‌ మొత్తం అక్కడే రూమ్‌లో ఉన్నారు. దీంతో వాళ్లందర్నీ చూసి నేను ఆశ్చర్యపోయా. ఇది నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. నాలో చాలా కంగారు మొదలైంది. నేను ఆడిషన్‌ ఇవ్వడం పూర్తయిన వెంటనే అనురాగ్‌ వాళ్ల టీమ్‌ వైపు చూసి.. ఆమె ఎలా చేసింది? అని అడిగారు. ఆ క్షణం సినీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త ఆడిషన్ అదే అనిపించింది,.' అని అన్నారు. అదృష్టవశాత్తు తాను ఆ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సన్నీ లియోన్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement