రౌడీ బేబీ కామెడీ | Sundeep Kishan Rowdy Baby Movie Launched | Sakshi
Sakshi News home page

రౌడీ బేబీ కామెడీ

Dec 17 2020 6:01 AM | Updated on Dec 17 2020 6:01 AM

Sundeep Kishan Rowdy Baby Movie Launched - Sakshi

నేహా శెట్టి, సందీప్‌ కిషన్, రాజేంద్రప్రసాద్, ఎంవీవీ సత్యనారాయణ

సందీప్‌ కిషన్, నేహా శెట్టి జంటగా రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటì స్తున్న చిత్రం ‘రౌడీ బేబీ’. జి. నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్‌ సమర్పణలో విశాఖపట్నం పార్లమెంట్‌ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సహ నిర్మాత జీవీ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, ఎంవీవీ సత్యనారాయణ క్లాప్‌ ఇచ్చారు. కోన వెంకట్‌ గౌరవ దర్శకత్వం వహించారు. రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యుడు మరగాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్‌రాజ్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కామెడీ చిత్రాలతో స్టార్‌ రైటర్‌గా ఎదిగాను. అదే కామెడీని బేస్‌ చేసుకుని ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యాం’’ అన్నారు కోన వెంకట్‌. ‘‘రెగ్యులర్‌ షూటింగ్‌ని బుధవారమే ప్రారంభించాం. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: చౌరస్తా రామ్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement