ఈసారి ముగ్గురు హీరోయిన్లతో.. సందీప్ కిషన్ | Sundeep Kishan New Film Karikala begins with three female leads | Sakshi
Sakshi News home page

ముగ్గురు హీరోయిన్లతో.. సందీప్ కిషన్

Oct 15 2026 9:16 PM | Updated on Oct 15 2026 9:16 PM

Sundeep Kishan New Film Karikala begins with three female leads

హీరో సందీప్ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కరికాల’ ఘనంగా ప్రారంభమైంది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్‌ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. భారీ ఊహా ప్రపంచం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ కథానాయికలుగా నటిస్తున్నారు. 

గురువారం నిర్వహించిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. వచ్చే వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా..
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘కరికాల’ కథను రెండు భాగాలుగా చెప్పినా ఎక్కడా బోర్ అనిపించలేదని తెలిపారు. గత ఆరు, ఏడు నెలలుగా దర్శకుడు యుగంధర్ ముని ప్రీ ప్రొడక్షన్ కోసం ఎంతో కష్టపడుతున్నారని ప్రశంసించారు. ఈ చిత్రం తన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.

తేదీలు ఖరారు
‘కరికాల’ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మేకర్స్ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తొలి భాగం 2027 జూలై 2న, రెండో భాగం అదే ఏడాది అక్టోబర్ 28న విడుదల కానుంది. సందీప్ కిషన్ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తుండటం, నాగలోకం, వానర లోకం వంటి విభిన్న నేపథ్యాలు ఉండటం ఆసక్తిని పెంచుతున్నాయి.

(ఇదీ చదవండి: ’రణబాలి‘ ఫీవర్‌.. జయమ్మగా సుమ ఫొటోలు వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement