-
థియేటర్లలో రాని క్రేజ్.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోన్న థ్రిల్లర్ మూవీ!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఆనంద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 16వ థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ.. నెల రోజులు కాకముందే సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ దక్కింతుకుంటోంది. ఓటీటికి వచ్చిన ఒక్క రోజులోనే నంబర్‌వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చినా.. 24 గంటల్లోనే ఇండియా వ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు రూ.27 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మించారు. The magic has now reached every home in the country 💫 Magical Entertainer #OoruPeruBhairavakona is entertaining every household and Trending #1 in India on @PrimeVideoIN ❤️🔥 - https://t.co/sDCJn9vPA7@sundeepkishan’s much-anticipated, A @Dir_Vi_Anand Fantasy@VarshaBollamma… pic.twitter.com/KV2bzeVgxe — AK Entertainments (@AKentsOfficial) March 9, 2024 -
విజయ్ సేతుపతితో సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ
ఆడియన్స్‌కు ఓ యాక్షన్ ఎంటర్టైనర్ను అందించేందుకు రెడీ అవుతున్నారు హీరోలు సందీప్ కిషన్, విజయ్ సేతుపతి. వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ బహు భాషా చిత్రానికి రంజిత్ జయకొడి దర్శకుడు. ‘ది ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్, ‘స్త్రీ’ చిత్రాల దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఆల్రెడీ స్టోరీ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. ఇంకో విశేషం ఏంటంటే... రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో వచ్చిన ‘ది ఫ్యామిలీమ్యాన్’ ఫస్ట్ సీజన్లో సందీప్ నటించారు. అలాగే రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో రానున్న షాహిద్ కపూర్ ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్) వెబ్ సిరీస్‌లో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్నారు. ఇలా విడివిడిగా వెబ్ సిరీస్‌కి కుదిరిన ఈ కాంబినేషన్ సినిమాకి సెట్ కావడం విశేషం. -
అలాంటి పాత్రలు వదులుకోను
‘‘నేను యాక్టర్‌ని కాకపోయుంటే కచ్చితంగా లాయర్ని అయ్యేదాన్ని. ఎందుకంటే అందరితో ఎక్కువగా వాదిస్తుంటాను’’ అన్నారు హన్సిక. సందీప్ కిషన్, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హన్సిక పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో అమాయకపు లాయర్ పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో మా నాన్న (మురళీ శర్మ) పెద్ద లాయర్. నేను చాలా తెలివైనదాన్ని అని నా ఫీలింగ్. సెక్షన్స్ అన్నీ తికమకగా చెప్పేస్తాను. తెనాలి రామకృష్ణతో తొలుత గొడవ, ఆ తర్వాత ప్రేమలో పడతాను. మేమిద్దరం ఓ కేసుని ఎలా డీల్ చేశామన్నది ఈ చిత్ర కథ. ► జి.నాగేశ్వరరెడ్డిగారితో ‘దేనికైనా రెడీ’ సినిమా చేశాను. ఆయన సినిమాలు చాలా సరదాగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. కుటుంబమంతా కలసి నవ్వుతూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. ► వరుసగా తమిళ సినిమాలు చేయడంతో తెలుగులో చిన్న గ్యాప్ ఏర్పడింది. కానీ, తెలుగు సినిమా అవకాశం ఎప్పుడు వచ్చినా చేస్తుంటాను. పాత్ర బావుంటే భాషతో నాకు పట్టింపు లేదు. నా పాత్రని ఎలా చేశా అన్నదే ముఖ్యం. ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా నేను ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వను. నేను చాలా కాన్ఫిడెంట్, సెక్యూర్ యాక్టర్‌ని. ► కార్ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ధన్‌తేరస్‌కి మా ఇంటి మహాలక్ష్మికి ఏదో ఒకటి ఇవ్వాలని మా అమ్మగారు నాకు కారును బహుమతిగా కొనిచ్చారు. నెగటివ్ రోల్, కామెడీ చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలు వస్తే అస్సలు వదులుకోను. కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేశాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని నా భావన. ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి.. అందరూ బావుండాలి అన్నదే నా ఫిలాసఫీ. ► ప్రస్తుతం తెలుగులో అమే జాన్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ‘భాగమతి’ దర్శకుడు అశోక్ డైరెక్టర్. షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం యూత్ ఎలా ఉంది? అనే యాంగిల్లో కథ సాగుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వెబ్ సిరీస్ బయటకు వస్తుంది. -
ప్రేమ, యాక్షన్లతో పక్కా కమర్షియల్..
నటుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలో రానుంది. మానగరం చిత్రంతో హిట్ జంటగా గుర్తింపు పొందిన సందీప్‌కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు దర్శకుడు. సాయిరామ్ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్.క్రియేషన్స్ పతాకంపై ఎన్.రాయ్రామ్ అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్.రాయ్రామ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచివాడిగా పెరుగుతాడని అన్నారు. తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నాం చేస్తాడని తెలిపారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది ? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు. ప్రేమ, యాక్షన్ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా సినిమా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్‌పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement