థియేటర్లలో రాని క్రేజ్.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోన్న థ్రిల్లర్ మూవీ! | Sakshi
Sakshi News home page

Ooru Peru Bhairavakona: ఓటీటీలో దూసుకెళ్తోన్న ఊరుపేరు భైరవకోన.. టాప్‌లో ట్రెండింగ్!

Published Sun, Mar 10 2024 12:42 PM

Sandeep Kishan Ooru Peru Bhairavakona Trending In Top Place In OTT - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ఈ చిత్రానికి ఆనంద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 16వ థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ..  నెల రోజులు కాకముందే సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ దక్కింతుకుంటోంది. ఓటీటికి వచ్చిన ఒక్క రోజులోనే నంబర్‌వన్‌ స్థానంలో ట్రెండ్‌ అవుతోంది. తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చినా.. 24 గంటల్లోనే  ఇండియా వ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు రూ.27 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హర్ష బొల్లమ్మ హీరోయిన్‍గా నటించారు. కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement