ప్రియమైన రాజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు

Suma Wishes Her Husband Rajeev Kanakala On His Birthday - Sakshi

సుమ కనకాల... ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని పేరు.. బుల్లితెరపై తన వాక్చాతుర్యంతో కొన్ని లక్షల మంది హృదయాలను దోచుకున్నారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, ఎదుటి వారిపై పంచ్‌లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ సుమ.. సీరియల్స్‌, యాంకరింగ్‌, ఆడియో ఫంక్షన్స్, సినిమాలు‌.. ఇలా అన్నింటిలోనూ అందె వేసిన చేయి ఆమెది. యాంకరింగ్‌లో కొత్తదనాన్ని తీసుకొచ్చి నేడు స్టార్‌ యాంకర్‌గా నిలదొక్కుకున్నారు. నేటి తరం యాంకర్‌లకు ఆదర్శంగా నిలిస్తూ, బుల్లితెరపై రారాణిగా నిలిచారు. సుమ వచ్చిన ఏ షో అయినా సందడిగా మారాల్సిందే.. 

దర్శకుడు దేవదాస్‌ కనకాల కుమారుడు అయిన రాజీవ్‌ కనకాలను సుమ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేడు(శుక్రవారం) రాజీవ్‌ కనకాల పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానుల నుంచి రాజీవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన భర్త రాజీవ్‌కు సుమ ప్రత్యేక బర్త్‌డే విషెస్‌ తెలిపారు. సుమ తన భర్తను ప్రేమగా రాజా అని పిలుచుకుంటారు. ఈ క్రమంలో ‘నా ప్రియమైన రాజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు నా బలం.. నా హ్యపీనెస్‌. నీతో జీవితాన్ని పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. నీతో ఉండే ప్రతి రోజు కొత్తగా ఉండాలని ఎదురు చూస్తున్నాను. లవ్‌ యూ.’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక కేరళ కుట్టి అయిన సుమ రాజీవ్‌ కనకాలను 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు రోషన్‌, కుతూరు మనస్వీని ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top