
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ 25వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కూడా.
తాజాగా ఈ జంట కేరళలో సందడి చేసింది. మలయాళ నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మలయాళ, తమిళ న్యూ ఇయర్‌గా భావించే విషును కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యాంకర్ సుమ కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు.