సుమ వింత ఫోటో షూట్‌.. భయపడిపోయిన రాజీవ్‌, ఫన్నీ వీడియో వైరల్‌ | Rajeev Kanakala Reaction To Suma Kanakala Weird Photoshoot, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Anchor Suma Weird Photoshoot: సుమ వింత ఫోటో షూట్‌.. ‘వామ్మో.. వాయమ్మో’ అంటూ దండం పెట్టిన రాజీవ్‌

Published Thu, Jan 18 2024 11:56 AM

Anchor Suma Shares Funny Video Of Rajeev Kanakala - Sakshi

ఒకవైపు టీవీ షోలు.. మరోవైపు సినిమా ఈవెంట్స్‌తో దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా కొనసాగుతున్నారు యాంకర్‌ సుమ. ఎలాంటి షో అయినా.. ప్రొగ్రామ్‌ అయినా యాంకర్‌గా సుమ ఉండాల్సిందే. కొంతమందికి అయితే ఆమె యాంకరింగ్‌ సెంటిమెంట్‌గాను మారింది.

(చదవండి: సూపర్‌ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా..భర్తగా గర్వంగా ఉంది: అక్షయ్‌ కుమార్‌)

ఆమె కోసం కొన్ని సినిమాల ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌ కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తనదైన యాంకరింగ్‌తో అంతలా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ని క్రియేట్‌ చేసుకుంది సుమ. కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ యాంకరమ్మ.  ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటుంది.

(చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి)

ఇక ఇటీవల వింత ఫోటో షూట్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది సుమ.  తన కొడుకు రోషన్‌ హీరోగా నటించిన బబుల్‌ గమ్‌ సినిమా రిలీజ్‌ టైమ్‌లో  హీరోయిన్‌  డ్రెస్‌తో సుమ ఓ ఫోటో షూట్‌ చేసింది.  అవి బాగా వైరల్‌ అయ్యాయి.

తాజాగా ఆ ఫోటో షూట్‌ సమయంలో రాజీవ్‌ రియాక్షన్‌ ఎలా ఉందో తెలియజేస్తూ  ఓ వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.  ఇందులో సుమ ఫోటో కోసం రకరకాల పోజులు ఇస్తుంటే.. రాజీవ్ ‘వామ్మో.. వాయమ్మో’అంటూ దండం పెట్టేశాడు. ‘నా ఫోటో షూట్‌ సమయంలో భర్త రియాక్షన్‌ ఇది’ అంటూ ఆ వీడియోని షేర్‌ చేసింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్‌ ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘రాజీవ్ గారు మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్’,  ‘సుమ అక్క రోజు రోజుకి మీ వయసు తగ్గిపోతుంది’అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement