Sakshi News home page

Sridevi sister: అక్కాచెల్లెళ్ల 21 ఏళ్ల అనుబంధం.. ఆ ఒక్క కారణంతోనే దూరం!

Published Sun, Sep 10 2023 2:18 PM

Sridevi sister Srilatha was once manager Of Her After They Not Talk this Reason  - Sakshi

అతిలోకసుందరి అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి. జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రంలో తన అమాయకపు మాటలతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగులో స్టార్‌ హీరోలందరితో పాటు సీనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. అప్పటి స్టార్‌ హీరోయిన్లతో పోలిస్తే శ్రీదేవికి ప్రత్యేకస్థానం ఉంటుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. సినీ కెరీర్‌లో తెలుగు ప్రేక్షకులు సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌ డైరెక్టర్ బోనీకపూర్‌ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

(ఇది చదవండి:  'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్‌ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!)

అయితే తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో శ్రీదేవి జన్మించారు.  రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. వీరిలో శ్రీదేవి పెద్దకూతురు. అయితే ఆమె సోదరి శ్రీలత గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే శ్రీదేవిలాగా ఆమె సినిమాల్లోకి రాలేదు. అయితే ఏ సినిమా సెట్‌కు వెళ్లినా అక్కతో పాటే కనిపించేవారు. తల్లి రాజేశ్వరితో పాటు, శ్రీలత కూడా శ్రీదేవితో పాటే ఉండేవారు. శ్రీలత దాదాపు 1972 నుంచి 1993 వరకు సినిమా సెట్స్‌లో శ్రీదేవితో పాటు వెళ్లేవారు. అలా 21 ఏళ్ల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచారు. అప్పట్లో వీరి కుటుంబం తమిళనాడులో శివకాశిలో ఉండేది. శ్రీదేవి కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమా సెట్స్‌లో శ్రీలత కనిపించారు. శ్రీలత కూడా శ్రీదేవి లాగే నటి కావాలనుకుంది. కానీ ఆమె ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్‌గా మారింది.

తల్లి మరణంతో  విభేదాలు

అయితే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం వారి మధ్య దూరాన్ని పెంచింది. తల్లి మరణంతో ఇద్దరు సోదరీమణుల మధ్య విభేదాలు పెరిగాయి. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో ఉండగా ఒకసారి ఆపరేషన్ చేయించాలని ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో డాక్టర్ చేసిన తప్పుకు ఆమె తల్లి జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేక రాజేశ్వరి 1996లో మరణించింది. దీంతో శ్రీదేవి ఆసుపత్రిపై కేసు పెట్టవలసి వచ్చింది. ఈ కేసులో చివరికీ శ్రీదేవిని గెలిచింది. తల్లి మరణంతో పరిహారంగా రూ.7.2 కోట్లు పొందింది.

(ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్‌: టాప్‌ హీరోయిన్‌ )

డబ్బుల కోసం కేసులు
ఆస్పత్రి పరిహారంగా చెల్లించిన రూ.7.2 కోట్లు శ్రీదేవి తన వద్దే ఉంచుకుందని సోదరి శ్రీలత ఆరోపించింది. దీంతో అక్కాచెల్లెళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. శ్రీలత తన వాటా డబ్బుల కోసం శ్రీదేవిపై కోర్టులో కేసు కూడా వేసింది. తన తల్లి మానసిక పరిస్థితి బాగా లేదని.. అందుకే తన ఆస్తి మొత్తాన్ని శ్రీదేవికి బదిలీ చేసిందని ఆరోపించింది.  శ్రీలత ఈ కేసులో గెలిచి తన వాటాగా రూ.2 కోట్లు దక్కించుకుంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం అక్కా, చెల్లెల్ల బంధాన్ని చెరిపేసింది. అంతా అన్యోన్యంగా ఉండేవారు కేవలం డబ్బువల్లే శత్రువులుగా మారిపోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అప్పట్లో బోనీకపూర్ కూడా ప్రయత్నించినట్లు సమాచారం. కాగా.. సూపర్‌ స్టార్‌గా ఎదిగిన శ్రీదేవి 2018లో దుబాయ్‌లో ఓ హోటల్‌లో మరణించారు. ఈ వివాదం వల్లే శ్రీదేవి మరణం తర్వాత చెన్నైలో జరిగిన ప్రార్థనా సమావేశంలో శ్రీలత కనిపించలేదని చెబుతున్నారు. 


 

Advertisement

What’s your opinion

Advertisement