
‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్ల అవుతుంది. ఈ పదహారేళ్లలో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రొజులలో చాలా మార్పులు రాబోతున్నాయి. పెద్ద రెవల్యూషన్ రాబోతుంది. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పు కి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి క్యారెక్టర్ లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం #సింగిల్(#single movie). కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహించారు. మే9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ డైరెక్టర్ కార్తీక్ రాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్ గా సినిమా చూసుకున్న తర్వాత చాలా పెద్ద ఎంటర్టైనర్ అవుతుందని అనిపించింది.ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని భావిస్తున్నాను.
→ ఈ సినిమా క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ నాలుగు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్ కి చాలా నచ్చుతాయి. క్లైమాక్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.
→ సినిమాని కంప్లీట్ గా హైదరాబాద్ లో తీసాం. హైదరాబాద్‌ని చాలా కొత్తగా చూపించాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదు. చాలా బెస్ట్ మూమెంట్స్ ని క్యాప్చర్ చేశాం.
→ నేను ప్రతి క్యారెక్టర్ నీ ఎంజాయ్ చేస్తాను. డైరెక్టర్ తోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఆ ట్రావెల్ లోనే 50% వచ్చేస్తుంది. తర్వాత లొకేషన్ లో ఇంకొంత క్యారెక్టర్ మీద కమాండ్ పెరుగుతుంది.
→ ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. ఇందులో లవ్‌స్టోరీ ఉంటుంది. దానికి తగ్గట్లుగానే నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ చూస్తారు.
→ సినిమా ఒక హైపర్ ఎనర్జీతో వచ్చింది. దానికి తగ్గట్టు విశాల్ చంద్రశేఖర్ ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్ఆర్ చాలా బాగా చేశారు. చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇన్నోవేటివ్ సౌండ్ ఉంటుంది
→ సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ ఒక ఫుల్ కామెడీ సినిమా అనుకున్నారు. మేము కూడా ప్రాపర్ కంటెంట్ ఇలా ఉంటుందని ప్రిపేర్ చేయలేకపోయాం. అందుకే చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందని అనుకుంటున్నాను. ఫుల్ ఫన్ అని వచ్చిన వాళ్ళు కొంత డిసప్పాయింట్మెంట్ అయిన మాట నిజమే. ఒక డిఫరెంట్ కంటెంట్ సినిమా చూడాలనే ఆడియన్స్ కి సినిమా చాలా నచ్చింది. టెలివిజన్ లో వచ్చిన తర్వాత కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. ప్రయోగం చేసినప్పుడు వర్క్ కాకపోతే దానిని ఎక్స్పీరియన్స్ కింద చూడాలి. వర్క్ అయినా వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం.
→ గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ లో చేయాలి. లక్కీగా ఈ సినిమా కుదిరింది 100% కాన్ఫిడెన్స్ ఉన్న జోనర్ ఇది. ఈ జోనర్ లో గీత ఆర్ట్స్ తో చేయడం వెరీ వెరీ హ్యాపీ.
→ ప్రస్తుతం మృత్యుంజయ అనే ఒక థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను.అలాగే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాను.