ఎన్టీఆర్‌కు బాలకృష్ణ గాత్ర నివాళి

Sr NTR Birth Anniversary: Balakrishna Shared Sri Rama Dandakam Viral Video - Sakshi

బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్‌ విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు(ఎన్టీఆర్‌) జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా తారకరామారావుకు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ గాత్ర నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ బాల‌కృష్ణ శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆల‌పించారు. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ ఈ వీడియోని త‌మ ట్విటర్‌లో విడుద‌ల చేయ‌గా, ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఎంతో కష్టతరమైన సంస్కృత పదాలను ఈజీగా పలికేశారు బాలయ్య. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక గతేడాది అత్యంత  ‘శివ శంకరి ..’ పాడి, తన అభిమానులకు విందుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. 

చదవండి :
గుండె తల్లడిల్లిపోతోంది తాతా: ఎన్టీఆర్‌ ఎమోషనల్‌
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి డిమాండ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top