ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే తెలుగువారికే గౌరవం: చిరంజీవి

Chiranjeevi Pays Tribute To Senior NTR And Demands Bharat Ratna For Legendary Actor - Sakshi

తెలుగు జాతి కీర్తిని, తెలుగు భాష ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. నోరు తిరగని డైలాగులను కూడా సింగిల్‌ టేక్‌లో చెప్పే ఈ దివంగత హీరోకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడని బిరుదు కూడా ఉంది. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో మెప్పించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్‌ బర్త్‌డే నేడు(మే 28). ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఓ డిమాండ్‌ను మరోసారి తెర మీదకు తీసుకొచ్చాడు. 

"ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్‌ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా.. మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి 100వ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌కు ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం" అని చిరు ట్వీట్‌ చేశాడు.

చదవండి: బాహుబలి, రేసుగుర్రం బాలనటుడు హీరోగా 'బ్యాచ్‌' మూవీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top