మహేశ్‌బాబు గుడ్‌న్యూస్‌.. ఆరోజే ఓపెనింగ్‌.. | South India First Dolby AMB In Bangalore Open on This Date | Sakshi
Sakshi News home page

తలుపులు తెరుచుకోనున్నాయి.. శుభవార్త చెప్పిన మహేశ్‌

Jan 15 2026 7:42 AM | Updated on Jan 15 2026 7:42 AM

South India First Dolby AMB In Bangalore Open on This Date

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సినీప్రేమికులకు శుభవార్త చెప్పాడు. బెంగళూరులో కొత్తగా నిర్మించిన ఏఎమ్‌బీ సినిమాస్‌ జనవరి 16న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. జనవరి 16న AMB సినిమా హాల్‌ తలుపులు తెరుచుకోనున్నాయి. దక్షిణ భారతదేశంలో తొలిసారి డాల్బీ సినిమా అనుభవాన్ని పంచేందుకు మా థియేటర్‌ సిద్ధమైంది. 

రేపే ప్రారంభం
డాల్బీ కోసం ఎంతగానో కష్టపడ్డ AMB సినిమాస్‌ టీమ్‌కు కృతజ్ఞతలు. ప్రారంభ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. అని ట్వీట్‌ చేశారు. బెంగళూరు గాంధీ నగర్‌లో గతంలో కపాలి థియేటర్‌ ఉన్న స్థలంలోనే ఏఎమ్‌బీ మల్టీప్లెక్స్‌ నిర్మించారు. దక్షిణాదిలో ఇదే తొలి డాల్బీ థియేటర్‌. మరోవైపు హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో డాల్బీ సినిమా స్క్రీన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌ కావడం విశేషం.

సినిమా
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తున్న ఫారెస్ట్‌ అడ్వెంచర్‌, మైథాలజీ మూవీ "వారణాసి". రుద్రగా మహేశ్‌బాబు నటిస్తుండగా, మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వెండితెరపై కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో యాక్ట్‌ చేస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న ఈ కళాఖండాన్ని కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ 2027 వేసవిలో విడుదల కానుంది.

 

 

చదవండి: నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement