100 కోట్ల మార్క్‌ను దాటిన సూర్యవంశీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే..? | Sooryvanshi Movie Comes To Netflix | Sakshi
Sakshi News home page

Sooryvanshi: 100 కోట్ల మార్క్‌ను దాటిన సూర్యవంశీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే..?

Nov 9 2021 1:17 PM | Updated on Nov 9 2021 1:44 PM

Sooryvanshi Movie Comes To Netflix  - Sakshi

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం సూర్యవంశీ. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్‌ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. రిలీజైన తొలిరోజే రూ. 26 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజులకే రూ.100 కోట్ల మార్కును దాటింది. మొదటి వారం చివరిలోగా రూ.120 కోట్ల మార్కును దాటనున్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు సూర్యవంశీని ఓటీటీలోకి తీసుకరానున్నారు. ఇందుకుగాను నెట్‌ఫ్లిక్స్‌తో భారీ డీల్‌ కుదుర‍్చుకున్నట్లు సమాచారం. డిసెంబర్‌ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ చేసేందుకు అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

సూర్యవంశీకి పెద్ద హిట్ ఇచ‍్చినందకు ప్రేక్షకులకు అక్షయ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌స్టాలో గూఫీ వీడియోతో థ్యాంక్స్ చెప్పారు. 'ఇలా గూఫీ గిగ్ చేసినందుకు క్షమించండి.. నేను సంతోషం పట్టలేకున్నాను. సూర్యవంశీని ఇంతలా ఆదరించినందుకు థ్యాంక్‌ యూ' అని పోస్ట్‌ చేశారు. 

రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన సూర్యవంశీలో హీరోయిన్‌గా కత్రీనాకైఫ్‌ నటించారు. అజయ్‌ దేవగణ్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రిలియన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.

Advertisement
 
Advertisement
Advertisement