భావోద్వేగం, సోనూ సూద్‌ కంటతడి!

Sonusood Gets Emotional In The Kapil Sharma show  - Sakshi

సినిమాలో విలన్‌గా కనిపించే సోనూసూద్‌ రియల్‌లైఫ్‌లో మాత్రం అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ల ఊర్లకు చేర్చాడు. ఆ తరువాత కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఎవరు సాయం అడిగిన లేదనకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు సోనూసూద్‌. ప్రాంతం, భాష, కులం, మతంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారికి  అండగా నిలుస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు ఒక్కరోజులో ట్రాక్టర్‌ పంపించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. లాక్‌డౌన్‌ తరువాత ప్రసారం అవుతున్న ‘ది కపిల్‌ శర్మ’ షోకు సోనూసూద్‌ గెస్ట్‌గా వస్తున్నాడు. అయితే ఈ షోలో సోనూ సూద్‌ వల్ల సాయం పొందిన చాలా మంది ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన సోనూసూద్‌ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోని టీవీ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. తరువాత కపిల్‌శర్మ యధావిధిగా షోలో నవ్వులు పూయించాడు. ఈ ఎపిసోడ్‌ శనివారం ప్రసారం కానుంది.  చదవండి: సోనూసూద్‌ క్రేజ్‌: ‘ఆచార్య’లో ముఖ్య పాత్ర

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top