సోనుసూద్‌ ట్వీట్‌, మండిపడుతున్న నెటిజన్లు

Sonu Sood And Sussanne Khan Supports Shah Rukh Khan Son Aryan Khan - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్‌ కేసు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌పై దాడి చేసిన పోలీసులు ఆర్యన్‌తో పులువురి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పోలీసులు పలు రకాల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్యన్‌ ఎన్‌సీబీ కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో షారుక్‌కు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, సునీల్‌ శెట్టి, పూజ భట్‌లతో పాటు పలువురు మద్దుతుగా నిలిచిన సంగతి తెలిసిందే. 

చదవండి: ఆర్యన్‌ ఖాన్‌పై ఆరోపణలు నిరాధారం: అర్బాజ్‌ తండ్రి

తాజాగా రియల్‌ హీరో, నటుడు సోనుసూద్‌, స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌లు సైతం షారుక్‌ మద్దుతుగా నిలిచారు. కాగా నిన్న ఆర్యన్‌కు ముంబై కోర్టు బెయిల్‌ నిరాకరించి అక్టోబర్‌ 7 వరకు ఎన్‌సీబీ కస్టడిలో ఉండాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్యన్‌ పేరు ప్రస్తావించకుండా సోనూసూద్‌ హిందీలో ట్వీట్‌ చేశాడు. ‘పిల్లలు విలువైన వారు. నిజానిజాలు బయటకు రావడానికి కాస్త సమయంలో పడుతుంది. అప్పుడే మీరు దేవుడిలా పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోకండి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలి’ అంటూ రాసుకొచ్చాడు.

సోనుసూద్‌ ఆర్యన్‌ ఉద్దేశించే ఈ ట్వీట్‌ చేశారని భావించిన ఓ నెటజన్‌ స్పందిస్తూ.. ‘23 ఏళ్ల వయసులోనే కపిల్‌ దేవ్‌ ఇండియాకు వరల్డ్‌ కప్‌ గెలిచాడు. 23 ఏళ్ల వయసులో నీరజ్‌ చొప్రా ఒలింపిక్స్‌ గెలిచిని ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ తెచ్చాడు. 23 ఏళ్ల వయసులోనే సచిన్‌ 1996 వరల్డ్‌ కప్‌ సమయంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు సృష్టించాడు. ఇదే 23 ఏళ్లలో భగత్‌ సింగ్‌ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు. మరీ 23 ఏళ్లకు ఆర్యన్‌ చిన్నపిల్లాడా?’ అంటూ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ కూడా ‘ఆర్యన్‌ ఎంటో​ మాకు తెలుసు. 23 ఏళ్లలోనే అతడు రేవ్‌ పార్టీకి వెళ్లాడంటే అతడు మంచివాడ, చెడ్డవాడనేది తెలిసిపోతుంది.

చదవండి: తండ్రిని చూసి గుక్కపెట్టి ఏడ్చిన ఆర్యన్‌ ఖాన్‌

అతడి  అలవాట్లు ఎలా ఉంటాయో కూడా అంచన వేయగలం. జనాలు అంత పిచ్చివాళ్లు కాదు. ఇప్పుడు మీరు అతడిని మంచి వాడిలా చూపించే ప్రయత్నం చేయకండి’ అంటూ కామెంట్‌ చేశాడు. అలాగే హృతిక్‌ మాజీ భార్య సుసానే కూడా ట్వీట్‌ చేస్తూ.. ‘ఆర్యన్‌ మంచి పిల్లాడు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడాన్ని నమ్మలేకపోతున్నా. ఒకవేళ ఆర్యన్‌ అనుకొకుండా తప్పుడు ప్లేస్‌ ఉండోచ్చు. కావాలనే అతడిని ఇందులో ఇరికించారమో. ఏం జరిగినా షారుక్‌, గౌరిలకు నా మద్దతు ఉంటుంది’ అంటూ ట్వీట్‌ చేసింది.అయితే వారు చేసిన ట్వీట్‌లు చూసిన నెటిజన్లు వీరిద్దరిపై  అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top