పెళ్లి పీటలెక్కనున్న సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్‌! | Sonia, Sidhu Pavan Marriage Date Fix | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కనున్న సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్‌!

Jul 4 2026 11:29 AM | Updated on Jul 4 2026 11:41 AM

Sonia, Sidhu Pavan Marriage Date Fix

యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సెలబ్రిటీ జంట సిద్ధూ పవన్, సోనియా సింగ్. వీరిద్దరు బుల్లితెరపై చేసే హడావుడి అంతా ఇంత కాదు. పలు షోలలో జంటగా పాల్గొంటూ.. తమదైన కామెడీ మాటలతో నవ్విస్తుంటారు. ముఖ్యంగా సోనియా అమాయకంగా చెప్పే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ నెట్టింట బాగా వైరల్‌ అవుతుంటాయి. ఇటీవల ఓ రియాల్టీ షోలోనూ ఈ జంట పాల్గొని తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. 

అయితే గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కలిసే ఉన్నప్పటికీ.. వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. దీనిపై తాజాగా సోనియా స్పందించారు. త్వరలోనే పెళ్లి చేసుకోతున్నట్లు వెల్లడించారు.

తాజాగా ఓ న్యూస్‌ చానల్‌ నిర్వహిస్తున్న ఓ టాక్‌ షోలో పాల్గొన్న సోనియాని పెళ్లి ఎప్పుడు అని హోస్ట్‌ ప్రశ్నించగా.. ‘ఏమో.. పెళ్లయిపోయిందేమో.. నేను చెప్పట్లేదేమో’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఆమె. అనంతరం అసలు విషయాన్ని వెల్లడిస్తూ.. ‘సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 1:45 గంటలకు మా పెళ్లి జరగనుంది’ అని చెప్పింది.

యూట్యూబ్‌ వీడియోల ద్వారా పాపులర్‌ అయిన సోనియా.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.'విరూపాక్ష'సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అందులో  హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో కామెడీ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడుదలైన 'నాగబంధం' సినిమాలో కూడా సోనియా కీలక పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement