breaking news
Sonia Singh
-
పెళ్లి పీటలెక్కనున్న సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్!
యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సెలబ్రిటీ జంట సిద్ధూ పవన్, సోనియా సింగ్. వీరిద్దరు బుల్లితెరపై చేసే హడావుడి అంతా ఇంత కాదు. పలు షోలలో జంటగా పాల్గొంటూ.. తమదైన కామెడీ మాటలతో నవ్విస్తుంటారు. ముఖ్యంగా సోనియా అమాయకంగా చెప్పే డబుల్ మీనింగ్ డైలాగ్స్ నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. ఇటీవల ఓ రియాల్టీ షోలోనూ ఈ జంట పాల్గొని తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కలిసే ఉన్నప్పటికీ.. వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. దీనిపై తాజాగా సోనియా స్పందించారు. త్వరలోనే పెళ్లి చేసుకోతున్నట్లు వెల్లడించారు.తాజాగా ఓ న్యూస్ చానల్ నిర్వహిస్తున్న ఓ టాక్ షోలో పాల్గొన్న సోనియాని పెళ్లి ఎప్పుడు అని హోస్ట్ ప్రశ్నించగా.. ‘ఏమో.. పెళ్లయిపోయిందేమో.. నేను చెప్పట్లేదేమో’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఆమె. అనంతరం అసలు విషయాన్ని వెల్లడిస్తూ.. ‘సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 1:45 గంటలకు మా పెళ్లి జరగనుంది’ అని చెప్పింది.యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సోనియా.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.'విరూపాక్ష'సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో కామెడీ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడుదలైన 'నాగబంధం' సినిమాలో కూడా సోనియా కీలక పాత్రలో నటించారు. -
తిరుమల శ్రీవారి సేవలో నటి సోనియా సింగ్ (ఫొటోలు)
-
సరికొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ప్రారంభించిన సినీనటి సోనియా సింగ్ (ఫొటోలు)
-
విరూపాక్ష భారీ డిజాస్టర్
-
ప్రిక్వార్టర్స్‌లో సోనియా
న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు దూసుకెళ్తున్నారు. మూడో రోజు శనివారం జరిగిన అన్ని బౌట్లలో భారత బాక్సర్లు విజయం సాధించారు. యువ బాక్సర్ సోనియాతో పాటు పింకీ, సిమ్రన్‌జీత్ కౌర్‌లు తొలి బౌట్లలో సునాయాసంగా గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరారు. శనివారం 57 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్లో సోనియా 5–0తో దోవా తౌజనీ (మొరాకో)పై విజయం సాధించింది. హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియాకు ఇదే తొలి ప్రపంచ చాంపియన్‌షిప్ కావడం విశేషం. 51 కేజీల విభాగంలో పింకీ 4–1తో అనుష్ గ్రిగోరియాన్ (అర్మేనియా)పై నెగ్గింది. 64 కేజీల విభాగంలో సిమ్రన్‌జీత్ 4–1తో అమేలియా మూరే (అమెరికా)ను చిత్తుచేసింది. నేడు జరుగనున్న బౌట్లలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్‌తో సహా ఐదుగురు భారత బాక్సర్లు బరిలో దిగనున్నారు. -
ట్విట్టర్ వార్
మైసూరు: నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీపై చేసిన ట్వీట్‌తో ఎంపీ, మహిళా ఐపీఎస్ అధికారి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు... ఐపీఎస్ అధికారులైన మధుకర్‌శెట్టి, కౌశలేంద్రకుమార్, లాభూరామ్, సోనియాసింగ్‌లను ఇటీవల కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలను మైసూరు ఎంపీ ప్రతాపసింహ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను ఉన్నత పదవులతో గౌరవించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుడంటంతోనే ఐపీఎస్ అధికారులు కేంద్రానికి బదిలీపై వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ ప్రతాపసింహ చేసిన ట్విట్టర్‌పై మహిళా ఐపీఎస్ అధికారి రూప అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను రాజకీయ వివాదాల్లోకి రావద్దంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రతీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారికి కేంద్రంలో పని చేయాలనే ఉంటుందంటూ తెలిపిన ఆమె దీనికి రాజకీయ ప్రతినిధులు రాజకీయ రంగు పులమరాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యల ద్వారా పాలన వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని తద్వారా పాలన వ్యవస్థ గాడి తప్పుతుందంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రతాపసింహ తాను కేవలం మాధ్యమాల్లో ప్రచురితమైన వార్తలను మాత్రమే షేర్ చేసానని, మీకు వీలైనపుడు ట్వీట్లను మరోసారి పునఃపరిశీలించాలంటూ సూచించారు. దీనిపై మహిళా ఐపీఎస్ అధికారి రూప రాజకీయ నాయకులుగా మీపని మీరు చేసుకుంటూ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను వారి పని చేసుకోనివ్వాలంటూ పరోక్షంగా హితవు పలికి ట్విట్టర్లో మాటల యుద్ధానికి తెరదించారు.


