Sonakshi Sinha: హీరోయిన్‌ బాత్రూమ్‌లో ఫ్యాన్‌.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు

Sonakshi Sinha Fan Threatens Her In The Khatra Khatra Show - Sakshi

Sonakshi Sinha Fan Threatens Her In The Khatra Khatra Show: సల్మాన్ ఖాన్‌ 'దబాంగ్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి అశేష అభిమానులన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా తన అభిమాని నుంచి వింత అనుభవాన్ని చవిచూసింది సోనాక్షి. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హాకు తన ఫ్యాన్‌ ఒకరు తనను పెళ్లి చేసుకోమ్మని, లేకుంటే తన గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వెరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్‌ చెక్‌ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్‌ రూమ్‌ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా' అని చెబుతాడు. 

చదవండి: నాలుగో తరగతిలో లైంగిక వేధింపులు.. ఆ దెబ్బతో మళ్లీ చూడలేదు

తర్వాత సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.' అని అంటాడు.  తర్వాత అక్కడ పరిస్థితులు అంతాగా బాగాలేనట్లు కనిపించింది. అద్దంపై లిపిస్ట్‌క్‌తో 'ఐ లవ్‌ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని సోనాక్షితో ఆ అభిమాని చెబుతాడు. ఇదంతా అర్థంకానీ సోనాక్షి అదేం వద్దూ అని చేతులతో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో ఆవేశానికి లైనైనా ఆ అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా తన జేబులో నుంచి కత్తి తీసి 'నువ్‌ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను' అని సోనాక్షిని బెదిరిస్తాడు. దీంతో షాక్‌కు గురైన సోనాక్షి కేకలు వేయడంతో వీడియో ముగుస్తుంది. 

చదవండి: జిమ్‌ ఫొటో షేర్‌ చేసిన హీరో.. భార్య రియాక్షన్‌ ఏంటో తెలుసా ?

అయితే ఈ వీడియో అంతా 'ది ఖత్రా ఖత్రా' షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్‌ చేశారని తెలుస్తోంది. ఈ షోలో భారతీ సింగ్, హర్ష్‌ లింబాచియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్‌ ఫరా ఖాన్ స్పెషల్‌ హోస్ట్‌గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్‌ ఇక్బాల్‌తో కలిసి డబుల్‌ ఎక్స్‌ఎల్‌ సినిమాలో నటించనుంది. 


 

చదవండి: నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్‌ కపూర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top