Prince Movie: శివకార్తికేయన్ ప్రిన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

హీరోహీరోయిన్లు శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుస్కూర్ రామ్మోహనరావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
సినిమా కథేంటంటే.. శివకార్తికేయన్ ఓ స్కూలు టీచర్. అదే స్కూల్‌లోని ఇంగ్లీష్ టీచర్ మరియాను ప్రేమిస్తాడు. ఇతడు ఇండియన్ అబ్బాయి, అక్కడ ఆమె బ్రిటీష్ అమ్మాయి కావడంతో వీరి ప్రేమకు రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో ఇది ప్రేమ పోరాటంలా కాకుండా రెండు దేశాల మధ్య పోట్లాటగా మారుతుంది. మరి ఆనంద్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే అసలు కథ.
‘All Indians are my brothers and sisters’#PrinceOnHotstar from November 25, Only on @DisneyPlusHSTel.
Here's the trailer ▶️ https://t.co/uGjmaidbTq@Siva_Kartikeyan @anudeepfilm @maria_ryab @SureshProdns @SVCLLP @ShanthiTalkies @manojdft @Cinemainmygenes #Sathyaraj pic.twitter.com/VuFtGeWLLz
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 15, 2022
చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
ఇటీవల ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం