క్రేజీ న్యూస్‌.. రజనీకాంత్‌ మూవీలో యంగ్‌ హీరో

Sivakarthikeyan To Play Key Role In Rajinikanth Nelson Dileep Movie - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం బీస్ట్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'బీస్ట్' సినిమాను నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ వారే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్‌ చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారం ఈ సినిమాలో యంగ్‌ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్‌ హీరో శివ కార్తికేయన్‌. గతంలో ఆయనకి  'డాక్టర్' సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ హిట్ ఇచ్చాడు.  100 కోట్ల క్లబ్ లో చేరిన ఆ సినిమాకి శివకార్తికేయన్ నిర్మాత కూడా. అందుకే మరోసారి నెల్సన్‌ మూవీలో చేసేందుకు శివ కార్తికేయన్‌ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కోలీవుడ్‌ టాక్‌. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top