Single character movie 'Hello Meera' will release on April 21st - Sakshi
Sakshi News home page

Hello Meera Movie: సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్ర.. హలో మీరా!

Apr 17 2023 11:54 AM | Updated on Apr 17 2023 12:54 PM

Single Character Movie Hello Meera Release On 21st April - Sakshi

ఓకే ఒక్క క్యారెక్టర్‌లో సినిమా తీయడం సాధ్యమేనా? ఇంతకుముందు ఇలాంటి సినిమాలు తీశారా? ఎలాంటి డైలాగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్ లేకుండా.. అది ఓకే పాత్రతో తెరకెక్కించడం అది పెద్ద సాహసమే. ఒకే ఒక్క క్యారెక్టర్‌‌లో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ వెండితెరపై పండించడం అంత సులువు కాదు. అదే చేసి చూపించారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్.  తెరపై కేవలం ఒక అమ్మాయిని మాత్రమే చూపిస్తూ సగటు ప్రేక్షకుడి బుర్రలో బోలెడు రోల్స్ మెదిలేలా ఈ సినిమాను తెరకెక్కించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హలో..మీరా. ఈ చిత్రానికి శ్రీనివాస్‌ కాకర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ చిన్నా సంగీతం అందిస్తున్నాడు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న హలో..మీరా ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. కేవలం ఒకే ఒక్క క్యారెక్టర్‌‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు.  ఇప్పటికే విడుదలైన  పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement