Sri Reddy and Sreerama Chandra Whatsapp Chat: నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు పెద్దమనుషుల భాగోతాలను బయటపెట్టి షాక్ ఇచ్చింది. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర తనతో చేసిన వాట్సాప్ చాట్‌ను కూడా లీక్ చేసింది. 'చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్' అంటూ అతడి గుట్టు రట్టు చేసింది. ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటోలను కూడా బయటపెట్టింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం తాజాగా మరోసారి తెరమీదకు వచ్చింది.

ప్రస్తుతం శ్రీరామచంద్ర బిగ్‌బాస్ సీజన్-5లో కంటెస్టెంటుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీరామ్ అంటే గొట్టని వాళ్లు, ఇతర కంటెస్టెంట్ల ఫాలోవర్లు ప్రస్తుతం దీన్ని ఆయుధంగా చేసుకొని శ్రీరామ్‌ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ఇది శ్రీరామచంద్రుడి భాగోతం..అతడికి సపోర్ట్ చేయకండి అంటూ సోషల్ మీడియాలో అతనిపై విషం చిమ్ముతున్నారు.

కండబలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా శ్రీరామచంద్ర తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో వాట్సాప్ చాట్ మరోసారి తెరమీదకి రావడం అతని ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుందంటూ శ్రీరామ్ ఫాలోవర్స్ మండిపడుతున్నారు. మరోవైపు శ్రీరామచంద్రకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.


