Singer Sangeetha Sajith Death: ప్రముఖ గాయని కన్నుమూత.. 200కిపైగా పాటలు

Singer Sangeetha Sajith Passes Away Due To Kidney Ailment - Sakshi

Singer Sangeetha Sajith Passes Away Due To Kidney Ailment: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్‌ సంగీత సాజిత్ ఇకలేరు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె కేరళలోని తిరువనంతపురంలో ఉన్న తన సోదరి నివాసంలో ఆదివారం (మే 22) కన్నుమూశారు. 46 ఏళ్ల సంగీత తన సోదరి వద్ద చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సంగీత మరణించారు. ఆమె అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం తిరువనంతపురం థైకాడ్‌లోని శాంతికవాదం పబ్లిక్‌ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంగీతం అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడారు సంగీత. దక్షిణాది పరిశ్రమల చిత్రాలన్ని కలిపి సుమారు 200కి పైగా పాటలను ఆలపించారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన 'మిస్టర్‌ రోమియో'లోని తమిళ సాంగ్‌ 'తన్నీరై కథలిక్కుమ్‌'తో మంచి గుర్తింపు పొందారు. ఇటీవల మలయాళ సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌'లోని 'తాళం పోయి తప్పూమ్‌ పోయి' సాంగ్‌ ప్రేక్షకాదరణ పొందింది. 

చదవండి: మదురై దంపతులకు షాక్‌ ఇచ్చిన ధనుష్‌.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’

అలాగే 'కక్కకుయిల్‌'లోని 'అలరే గోవిందా', 'పజ్జస్సి రాజాలో'ని 'ఓడతండిల్ తాళం కొట్టుమ్‌', 'రక్కిలిపట్టు'లోని 'ధుమ్ ధుమ్‌ దూరే' హిట్‌ సాధించాయి. ఇటీవల పృథ్వీరాజ్‌ నటించిన 'కురితి' మూవీలో థీమ్ సాంగ్‌ పాడారు. తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డుల వేడుకలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఎదుట 'జ్ఞానపజాతే పిజింత్‌' పాటను ఆలపించారు సంగీత. ఆ పాట ఎంతగానో ఆకట్టుకున్నందుకు ఆమె 10 గ్రాముల బంగారు హారాన్ని బహుమతిగా పొందినట్లు సమాచారం. 

చదవండి: తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top