Singer Mangli Remuneration: రెమ్యునరేషన్‌ అమాంతం పెంచేసిన మంగ్లీ..ఒక్కో పాటకు ఎంతంటే

Singer Mangli Take Huge Remuneration Per Song - Sakshi

సింగర్‌ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరర్లేదు. మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం ఆమె.  న్యూస్‌ చానల్‌లో యాంకర్‌గా కెరీర్‌ని స్టార్ట్‌ చేసి.. స్టార్‌ సింగర్‌గా మారిపోయారు. మొదట్లో తెలంగాణ యాసలో పాటలు పాడుతూ.. బతుకమ్మ సాంగ్స్‌తో ఫేమస్‌ అయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. అందులో ఆమె పాడిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ కావడంతో మంగ్లీ జీవితమే మారిపోయింది. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె స్టార్‌ సింగర్‌గా కొనసాగుతుంది. ఆమె ఆలపించిన పాటల్లో  ‘రాములో రాముల’, ‘సారంగదరియా’, ‘జింతక్ చితక్’, ‘ఊరంతా’, ‘బుల్లెట్’, ‘జ్వాలా రెడ్డి’, ‘రా రా రక్కమ్మ’, ‘కన్నె అదిరింది’ వంటి సాంగ్స్‌ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి.

ఇలా ఆమె పాడిన పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలవడంతో .. పారితోషికాన్ని ఆమాంతం పెంచేసిందట మంగ్లీ. ఒకప్పుడు ఒక్కో పాటు కేవలం రూ.20,000 మాత్రమే తీసుకున్న మంగ్లీ.. ఇప్పుడు రూ.2-3 లక్షల వరకు వసూలు చేస్తుందట. సినిమా విజయంలో మంగ్లీ పాటలు కూడా కీలకం అవుతుండడంతో నిర్మాతలు అంత మొత్తంలో ఇవ్వడానికి వెనకడుగు వేయడం లేదట.

మంగ్లీకి సొంతంగా ఓ యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. అందులో ఆమె సొంతంగా నిర్మించిన పాటలను విడుదల చేస్తుంది. దాని ద్వార కూడా మంగ్లీకి మంచి ఇన్‌కమే వస్తోంది. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇలా నాలుగైదు రకాలుగా మంగ్లీ భారీగా సంపాదిస్తోందని ఇండస్ట్రీ టాక్‌. చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన సత్యవతి రాథోడ్(మంగ్లీ అసలు పేరు)..ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇలా స్టార్‌ సింగర్‌గా రాణించడం నిజంగా అభినందించాల్సిన విషయమే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top