Singer Mangli: పాన్‌ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా మంగ్లీ

Singer Mangli Debut As Heroine with Padaraya Movie - Sakshi

జానపదంతో ఆమె దోస్తీ చేసింది. తన గొంతులో పదాలు పాటలయ్యాయి. ఆ పాటల ప్రవాహం జలపాతంలా జనాలను తాకింది. ఆమె కంఠానికి, రక్తి కట్టించే పాటలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. తెలియకుండానే ఆమె అభిమానులయ్యారు. తన గాత్రంతో జనాలను కట్టిపడేసిన ఆమె మరెవరో కాదు సింగర్‌ మంగ్లీ. జానపదం నుంచి సినిమాల దాకా నిరంతరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయాణం కొనసాగిస్తోంది. తాజాగా ఆమె సినిమాల్లో నటించనుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

చక్రవర్తి చంద్రచూడ్‌ డైరెక్ట్‌ చేస్తున్న పాదరాయ అనే కన్నడ సినిమాలో మంగ్లీ హీరోయిన్‌గా నటించనుందట. ఇప్పటికే కన్నడలోనూ పలు పాటలు పాడిన ఆమె ఈసారి ఏకంగా పాదరాయ అనే పాన్‌ ఇండియా మూవీలో కథానాయికగా నటించనున్నట్లు శాండల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతోంది. 2013-14లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. నాగశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌  త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి మంగ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

చదవండి: తేజస్వినితో ప్రేమలో పడ్డ అఖిల్‌ సార్థక్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top