Chinmayi: మన కల్చర్‌ చూసి వాళ్లే షాక్ అయ్యారు: సింగర్ చిన్మయి

Singer Chinmayi Sensational Comments About womens Blouses - Sakshi

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్‌గా మాత్రమే డిబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ రాణించారు. అయితే మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎలాంటి విషయాన్నైనా ముక్కుసాటిగా మాట్లాడే చిన్మయి.. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కొందరు యువకులు చేసిన ఇన్‌స్టా వీడియోపై ఆమె స్పందించారు. భారతీయ స్త్రీల వస్త్రధారణపై ఆమె చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. బ్లౌజ్‌లు వేసుకోవడం మన దేశ  సంస్కృతి కాదంటూ చిన్మయి తెలిపారు.

(ఇది చదవండి: ఎస్పీ బాలు చనిపోయినప్పుడు రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లాను: సింగర్‌)

కొందరు మహిళలు కనీసం చున్నీలు కూడా వేసుకోవడం లేదని ఓ యువకుడు ఇన్‌స్టాలో వీడియో షేర్ చేశాడు.  దీనికి తనదైన శైలిలో  సమాధానమిచ్చారు చిన్మయి. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ సంస్క్రృతి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. 

చిన్మయి మాట్లాడుతూ..'రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే బ్లౌజ్ కల్చర్‌ను తీసుకొచ్చారు. అప్పటివరకు మనదేశంలో అసలు జాకెట్లు వేసుకునేవారు కాదు. మహిళలను చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోండి. జాకెట్ లేకుండా ఉండటం చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారని.. అలా చూడడం వల్ల వారికి కలిగే లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు బ్లౌజ్ వేసుకునేవారు కాదు. బ్లౌజ్ అనేది బ్రిటిష్ కల్చర్. ముందు మన కల్చర్ ఏంటో తెలుసుకోండి.' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చారు. 

(ఇది చదవండి: PS 2లో జూనియర్‌ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్‌ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top