Singer Akash Ahuja Gets Priyanka Chopra Face Tattooed on His Back - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: ప్రియాంక ఫొటోను ఏకంగా వీపుపై టాటూ వేసుకున్న అమెరికా సింగర్‌

May 7 2022 6:51 PM | Updated on May 7 2022 8:03 PM

Singer Akash Ahuja Gets Priyanka Chopra Face Tattooed On His Back - Sakshi

తాజాగా అతడు ప్రియాంకపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. సింగర్‌, ర్యాపర్‌ ఆకాశ్‌ ఆహుజా ఆమె ముఖ చిత్రాన్ని టాటూగా వేసుకున్నాడు. ఇప్పటికే ప్రియాంక పేరును తన వీపుపై పచ్చబొట్టు వేసుకున్న ఆకాశ్‌ అక్కడితో ఆగకుండా ఇటీవల తన ఫోటోను సైతం వేయించుకోవడం విశేషం.

సినీ సెలబ్రెటీలకు వీపరితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంటుంది. తమకు ఇష్టమైన నటీనటులపై ఫ్యాన్స్‌ వివిధ రకాలుగా అభిమానం చూపిస్తుంటారు. వారి పేర్లను పెట్టుకోవడం, వారి ఫొటోలను ఇంట్లో పెట్టుకుని మురిసిపోతుంటారు. మరికొందరైతే ఏకంగా వారి పేర్లను టాటూ వేసుకుంటారు. సాధారణంగా స్టార్‌ హీరోహీరోయిన్ల పేర్లను పచ్చబొట్టు వేయించుకున్న సందర్భాలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ వారికి సాధారణ ప్రజలే కాదు సెలబ్రెటీల్లో సైతం ఫ్యాన్స్‌ ఉంటారు.

చదవండి: ఛీ, భర్త చనిపోయినా ఎంజాయ్‌ చేస్తోంది.. నీతూ కపూర్‌పై ట్రోలింగ్‌

గ్లోబర్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు సాధారణ ప్రజల్లోనే కాదు సెలబ్రిటీల్లో సైతం ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమెరికాకు చెందిన ఓ సింగర్‌ ప్రియాంకకు వీరాభిమాని. తాజాగా అతడు ప్రియాంకపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. సింగర్‌, ర్యాపర్‌ ఆకాశ్‌ ఆహుజా ఆమె ముఖ చిత్రాన్ని టాటూగా వేసుకున్నాడు. ఇప్పటికే ప్రియాంక పేరును తన వీపుపై పచ్చబొట్టు వేసుకున్న ఆకాశ్‌ అక్కడితో ఆగకుండా ఇటీవల తన ఫోటోను సైతం వేయించుకోవడం విశేషం.

చదవండి: ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఓటీటీలో చూడాలంటే డబ్బు చెల్లించాలా?

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆకాశ్‌ తన వీపు పూర్తి భాగంలో ప్రియాంక ముఖచిత్రాన్ని టాటూ వేసుకుంటున్నాడు. దానికి పైన ప్రియాంక అనే పేరు కూడా రాసి ఉంది. ఇదిలా ఉంటే ‘ప్రియాంక..’ అంటూ ఆకాశ్‌ ఇటీవల పాడిన పాటను తన ఫేవరెట్‌ హీరోయిన్‌కే అంకితమిచ్చాడు. ఇప్పుడు అదే పాట ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. పిచ్చి ముదిరిందని కొందరు ఆకాశ్‌పై విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అతడికి మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement