Sidharth Malhotra-Kiara Advani Reception in Mumbai, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Sidharth-Kiara Reception: ముంబైలో సిద్ధార్థ్‌-‍కియారా గ్రాండ్‌ రిసెప్షెన్‌, బాలీవుడ్‌ తారల సందడి.. ఫొటోలు వైరల్‌

Feb 13 2023 11:08 AM | Updated on Feb 13 2023 11:55 AM

Sidharth Malhotra, Kiara Advani Reception in Mumbai Photos Goes Viral - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వాణీ-సిద్ధార్థ్‌ మల్హోత్రాలు పెళ్లిబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, కొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. ఇక ప్రేమ, పెళ్లి విషయంలో గొప్యత పాటించిన ఈ జంట బి-టౌన్‌ సెలబ్రెటీల కోసం సిద్ధార్థ్‌-కియారాలు ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. నిన్న ఆదివారం (ఫిబ్రవరి 12) ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో సాయంత్రం 8:30 గంటలకు ఫంక్షన్‌ ఏర్పాటు చేసి సెలబ్రెటీలకు ఆహ్వానం ఇచ్చారు.

చదవండి: మేము మనుషులమే.. ట్రోల్స్‌పై ‘సీతారామం’ బ్యూటీ ఆవేదన

ఈ కార్యక్రమంలో సినీ తారలంత సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. షారుక్‌ ఖాన్‌, ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, హిద్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, వరుణ్‌ ధావన్‌, అక్షయ్‌ కుమార్‌, విద్యా బాలన్‌, పరిణీతి చోప్రా, జుహీ చావ్లా, అనిల్‌ కపూర్‌, ఆయుష్ శర్మ, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, శిల్పాశెట్టి, కరీనా కపూర్, దిశా పటాని, ఆదిత్య కపూర్‌తో సహా పలువురు సినీ సెలబ్రెటీలు కుటుంబసమేతంగా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఆమిర్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన! ఆయనకు ఏమైంది?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement