
హీరోయిన్ కియారా అడ్వాణీకి ఈ మధ్యే కూతురు పుట్టింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీల నుంచి ఆమె అభిమానుల వరకు చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. మన దగ్గర తక్కువ కానీ బాలీవుడ్‌లో ఫొటోగ్రాఫర్స్ కల్చర్ చాలా ఎక్కువ. నటీనటులు ఎక్కడికెళ్లినా సరే 10-15 మంది ఫొటోలు తీస్తూ కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కుమార్తె ఫొటోలు కూడా ఎవరైనా లీక్ చేస్తారేమోనని కియారా-సిద్ధార్థ్ దంపతులు ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. ఈ మేరకు దాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు.
'మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలతో మేం చాలా సంతోషపడుతున్నాం. తల్లిదండ్రులుగా మేం మొదటి అడుగులు వేస్తున్నాం. ఈ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సమయంలో గోప్యత పాటించాలనుకున్నాం. అందుకే ఫొటోలు షేర్ చేయడం లేదు. మీరు కూడా దయచేసి మా పాప ఫొటోలు తీయొద్దు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్స్' అని కియారా దంపతులు పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
కియారా-సిద్ధార్థ్ మల్హోత్రానే కాదు బాలీవుడ్ జంటలైన అనుష్క-విరాట్, దీపిక-రణ్‌వీర్ దంపతులు కూడా ఇప్పటివరకు తమ కూతురు ఫొటోలని ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఎవరికీ పిక్స్ తీయనివ్వలేదు. ఆలియా-రణ్‌బీర్ దంపతులు కూడా తమ కూతురు పుట్టిన కొన్నాళ్ల వరకు బయటకు చూపించలేదు. తెలుగులోనూ చరణ్-ఉపాసన కూడా తమ కుమార్తె ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
బాలీవుడ్‌లో వేర్వేరుగా కెరీర్ మొదలుపెట్టిన కియారా, సిద్దార్థ్ మల్హోత్రా.. 2021లో రిలీజైన 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడు మొదలైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. 2023లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లకు పాప పుట్టింది. కియారా అడ్వాణీ నటించిన 'వార్ 2' విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: బాలీవుడ్ న్యూసెన్స్‌కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి..)
