Shruti Haasan Reveal on shooting for Waltair Veerayya Song In France - Sakshi
Sakshi News home page

Shruti Haasan: ఆ చలిలో చాలా అసౌకర్యంగా ఫీలయ్యా: శృతిహాసన్

Jan 3 2023 8:55 PM | Updated on Jan 3 2023 9:29 PM

Shruti Haasan Reveal on shooting for Waltair Veerayya Song In France - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. శ్రుతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో మాస్‌ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటల సినిమా మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌ పాట'నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. నేనే చిరంజీవి అవుతా..' అంటూ సాగే సాంగ్‌ను ఫ్రాన్స్‌లోని మంచుకొండల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

అయితే తాజాగా హీరోయిన్ శృతిహాసన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో మైనస్ డీగ్రీల చలి ఉందని ఆమె తెలిపింది. ఆ పాట కోసం శారీలో ఆ వాతావరణంలో డ్యాన్స్ చేయడం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చింది భామ. అయినప్పటికీ అభిమానుల కోసం చేయాల్సిందేనని తెలిపింది.

శృతిహాసన్ మాట్లాడుతూ..'నేను మంచులో చీరతో డ్యాన్స్ మరొక పాట డ్యాన్స్ చేయనవసరం లేదని అనుకున్నా. ఎందుకంటే ఆ వాతావరణంలో నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. కానీ ప్రేక్షకులకు నచ్చేలా మేము తప్పకుండా చేయాల్సిందే. మైనస్ డిగ్రీల చలిలో నటించడం నాకు ఇబ్బందిగా అనిపించింది.' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement