మాల్దీవులు: సముద్రంలో సాగరకన్యగా మారిన శ్రద్ధా..‌

Shraddha Kapoor Enjoys Life Under Water, Watch Video - Sakshi

సెలబ్రిటీలు వెకేషన్‌కు వెళ్లాలనుకుంటే ముందు గుర్తొచ్చేది మాల్దీవులే. ఏ కాస్త సమయం దొరికినా చాలు అనేకమంది తారలు మరో ఆలోచనే లేకుండా మాల్దీవులకు చెక్కేస్తుంటారు. ఫ్రెండ్స్‌తో, లవర్‌తో, ఫ్యామిలీతో లేదంటే సోలోగా అయినా సరే వెళ్లిపోతుంటారు. 'సాహో' బ్యూటీ శ్రద్దా కపూర్‌ కూడా ప్రస్తుతం అక్కడే ఉంది. తన కుటుంబంతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో సాగరకన్యగా మారిపోయి సముద్రంలో మునకేసింది. నీటి లోపల జలరాశులతో పోటీపడుతూ స్విమ్‌ చేసింది. 'సముద్ర గర్భంలో జీవితం' అంటూ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇందులో సముద్రం లోపలి జీవరాశులు కనువిందు చేస్తున్నాయి. శ్రద్దా వాటితో స్నేహం చేస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

శ్రద్ధా కెరీర్‌ విషయానికొస్తే.. తీన్‌పత్తి చిత్రంతో ఆమె వెండితెరపై కాలు మోపింది. హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా హిందీలో పదుల సంఖ్యలో సినిమాలు చేసుకుంటూ పోయిన ఈ భామ ప్రభాస్‌ సరసన సాహోలో నటించి తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది. శ్రద్ధా చివరిసారిగా గతేడాది రిలీజైన భాగీ 3, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ సినిమాలతో ఆకట్టుకుంది. మరోవైపు విశాల్‌ ప్యూరియా దర్శకత్వం వహించనున్న చిత్రంలో నాగకన్యగా కనిపించనుంది. 

చదవండి: ‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్‌, దర్శిలకు రాహుల్ వార్నింగ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top