
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు బన్నివాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతూ పక్కా కమర్షియల్ సినిమాతో మరో మారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థ. తాజాగా ఈ బ్యానర్‌లో మరో కొత్త సినిమా ప్రారంభమైంది. జోహార్, అర్జున ఫల్గుణ లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
హైదరాబాద్ ఫిలిం నగర్ దైవసన్నిధానంలో గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి బన్నీ వాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్రతాప్ సహ నిర్మాత, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
Some journeys are worth waiting for… this one is going to be special :)#AlluAravind garu Presents @GA2Official's #ProductionNo8 launched today with a pooja ceremony.✨
— Rahul Vijay (@ActorRahulVijay) June 30, 2022
Produced by #BunnyVas & #VidhyaMadhuri
Directed by #TejaMarni @actorsrikanth @varusarath5 #Shivani pic.twitter.com/u76XITcrnY
చదవండి: అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి
అలాంటి సినిమాలను ప్రేక్షకులు వదులుకోరు: రాజమౌళి