నాగశౌర్య సరసన హాట్‌ బ్యూటీ ఎంట్రీ

 Shirley Setia to make Telugu film debut opposite Naga Shaurya     - Sakshi

నాగశౌర్య  హీరోయిన్‌గా టాప్ సింగర్‌ షిర్లీ సెటియా ఎంట్రీ

సాక్షి, హైదరాబాద్‌:  టాలీవుడ్ యంగ్‌హీరో నాగశౌర్య  సరసన టాప్‌ పాప్‌ సింగర్‌ తెలుగులో అడుగుపెడుతోంది. నాగ శౌర్య సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్ బ్యానర్ తెరకెక్కనున్న మూవీలో యూట్యూబర్, నటి షిర్లీ సెటియా (25) ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని షిర్లే స్వయంగా ట్విటర్‌లో ధృవీకరించింది. అటు ఇంకా టైటిల్ కాని ఫిక్స్ కాని ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా నటిస్తున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించారు.  రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా వస్తోన్న ఈ చిత్రాన్ని నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా, శంకర్ ములుపూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  లవర్‌, అలా ఎలా ఫేం అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.కాగా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో "మాస్కా" చిత్రంతో యాక్టింగ్‌ కరియర్‌ ఆరంభించిన సెటియా పాప్ సింగర్‌గా రాణించారు..  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top