యాక్షన్‌ స్టార్ట్‌ | Naga Shaurya to start his new film shooting | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ స్టార్ట్‌

Aug 11 2024 12:38 AM | Updated on Aug 11 2024 12:38 AM

Naga Shaurya to start his new film shooting

నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. దర్శకులు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, వైవీఎస్‌ చౌదరి, శ్రీను వైట్ల వద్ద దర్శకత్వం విభాగంలో పని చేసిన రామ్‌ దేశిన (రమేశ్‌) ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. పలు విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా చేసిన రామ్‌ దేశిన అద్భుతమైన కథను సిద్ధం చేశారు. శనివారమే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, సముద్ర ఖని, మైమ్‌ గోపి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: రసూల్‌ ఎల్లోర్, సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement