డబ్బు కోసమే అతడితో పెళ్లి? హీరోయిన్‌ ఏమందంటే.. | Shilpa Shetty Says She Did Not Marry Raj Kundra For Money, Says Iam Rich Too - Sakshi
Sakshi News home page

Shilpa Shetty: డబ్బు కోసమే పెళ్లి? నాకోసం ఎంతమంది లైన్‌లో నిలబడ్డారో తెలుసా..!

Mar 10 2024 8:49 PM | Updated on Mar 11 2024 10:08 AM

Shilpa Shetty says She Did Not Marry Raj Kundra for Money, Iam Rich Too - Sakshi

డబ్బు కోసమే రాజ్‌ కుంద్రాను పెళ్లి చేసుకుందని.. రాజ్‌కుంద్రా కంటే ధనవంతులు సైతం నన్ను పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డారు. కానీ నేనే పట్టించుకోలేదు.

'సాహసవీరుడు సాగరకన్య' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్‌ శిల్పా శెట్టి. వీడెవడండీ బాబు, ఆజాద్‌, భలేవాడివి బాసూ వంటి చిత్రాలతో అలరించింది. కానీ బాలీవుడ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ రావడంతో అక్కడే సెటిలైంది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ కొంతకాలంగా సినిమాలు, సిరీస్‌లపై మరింత ఫోకస్‌ చేసింది. 

డబ్బు కోసమే పెళ్లి?
తర్వాత 2009లో బిజినెస్‌మెన్‌ రాజ్‌కుంద్రాను పెళ్లాడింది. వీరికి ఒక బాబు పుట్టగా సరోగసి ద్వారా కూతురికి జన్మనిచ్చారు. డబ్బు కోసమే రాజ్‌ కుంద్రాను పెళ్లి చేసుకుందని శిల్పా శెట్టిపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆ ట్రోలింగ్‌పై హీరోయిన్‌ స్పందించింది. రాజ్‌కుంద్రా కంటే ధనవంతులు సైతం నన్ను పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డారు. కానీ నేనే పట్టించుకోలేదు.

మంచితనం చూశా..
అప్పుడు, ఇప్పుడు నేను ధనవంతురాలినే! నేను పెట్టిన బాస్టియన్‌ రెస్టారెంట్‌ వల్ల నేను మరింత ధనికురాలినయ్యాను. జనాలు ఏది పడితే అది వాగేముందు గూగుల్‌లో నా గురించి సెర్చ్‌ చేస్తే బాగుండేది. సక్సెస్‌ఫుల్‌ ఉమెన్‌గా నాకంటూ తోడు నిలబడే వ్యక్తి కావాలనుకున్నాను. డబ్బులు చూడలేదు, మంచితనాన్ని చూశాను. తను మంచి మనిషి కాకపోయుంటే ఆయన్ని పెళ్లి చేసుకునేదాన్నే కాదు అని చెప్పుకొచ్చింది శిల్పాశెట్టి.

చదవండి: నా పరుపు దులిపితే లక్షలకు లక్షలు దొరికాయి.. ఆ రోజు చిరంజీవి నాపై సీరియస్‌..: బాబూ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement